హుస్నాబాద్ కాంగ్రెస్‌లో ‘‘టికెట్’’ రచ్చ.. కొట్టుకున్న పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గీయులు
హుస్నాబాద్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వీర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది.

హుస్నాబాద్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వీర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్ వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. మోహన్ ప్రకాష్‌తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పొన్నం వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. ప్రజల్లోకి బలంగా వెళ్లే ఎన్నికల హామీలను ప్రకటించి కర్నాటకలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ ఇదే తరహా వ్యూహాలతో అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణకు ఇదే విధమైన హామీల జాబితాను ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తన కల అనీ, ఆ కలను సాకారం చేసేందుకు ప్రజలు పార్టీకి మద్దతివ్వాలని ఆమె కోరారు. 'తెలంగాణలో అన్ని వర్గాల కోసం పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడాలన్నది మా కల.. మీరంతా మాకు మద్దతు ఇస్తారా?' అని అక్కడకు వచ్చిన ప్రజలను ప్రశ్నించారు.
ఆదివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ భారీ 'విజయభేరి' బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె అన్నారు. 'ఈ గొప్ప రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భావంలో నేను, నా సహచరులతో కలిసి భాగమయ్యే అవకాశం లభించింది. ఇప్పుడు దాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది' అని సోనియాగాంధీ అన్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను సోనియా గాంధీ ప్రకటించారు.