Asianet News TeluguAsianet News Telugu

తాండూరు: రోహిత్ రెడ్డి ఫ్లెక్సీలు కాల్చివేత.. ఎమ్మెల్సీ వర్గీయుల ఇంటిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

వికారాబాద్ జిల్లా తాండూరు టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడం కలకలం రేపుతోంది. 

clashes between mla rohith reddy and mlc patnam Mahender Reddy in tandur
Author
Hyderabad, First Published Jun 8, 2022, 6:46 PM IST

వికారాబాద్ జిల్లా తాండూరు టీఆర్ఎస్‌లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అయితే వీటిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఇది ఎమ్మెల్సీ వర్గీయుల పనేనన్న అనుమానంతో వారి ఇళ్లపై రోహిత్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఈ వ్యవహారంపై ఇరు వర్గాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కాగా.. ఇటీవల TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ Rohith reddy భేటీ అయ్యారు. Tandurలో చోటు చేసుకొన్న పరిణామాలపై  కేటీఆర్ కు పైలెట్ రోహిత్ రెడ్డి వివరించారు. ఏప్రిల్ 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 

Also REad:కేటీఆర్‌తో పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ: తాండూరు ఘటనలపై టీఆర్ఎస్ నాయకత్వం ఆరా

ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు Mahender Reddyపై కేసు నమోదు చేశారు.  ఈ  విషయమై  ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో సైతం మాట్లాడారు.  సీఐని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో తనది కాదన్నారు. ఈ విషయమై తాను చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.. తనకు పోలీసులు అంటే గౌరవమని చెప్పారు. 

ఈ వ్యవహరం వెనుక ఎమ్మెల్యే పైలెట్  రోహిత్ రెడ్డి హస్తం ఉందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఇద్దరిని పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించి మాట్లాడారు. అయితే కొంత కాలంగా ఇరువురి మధ్య సఖ్యత ఉన్నట్టుగానే కప్నించింది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవరగంలో, పార్టీపై తమ పట్టును నిలుపుకొనేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమ వర్గాన్ని రోహత్ రెడ్డి వర్గం అణగ దొక్కే ప్రయత్నం చేస్తుందని మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios