నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ వర్గీయులు దాడి చేసుకున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ వర్గీయులు దాడి చేసుకున్నారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారని డీసీసీ ప్రెసిడెంట్‌ను నిలదీశారు. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు ఇరువర్గాల కార్యకర్తలు. అనంతరం వన్‌టౌన్ పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.