Asianet News TeluguAsianet News Telugu

మధుసూదనాచారి వర్సెస్ గండ్ర వెంకటరమణారెడ్డి : శిలాఫలకంపై పేరు రచ్చ.. కవిత సమక్షంలోనే విభేదాలు

భూపాలపల్లి బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శిలాఫలకంపై మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరు లేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వర్గీయులు సైతం పోటాపోటీగా నినాదాలు చేశారు. 

clashes between brs leaders in mahabubabad district
Author
First Published Jan 22, 2023, 3:06 PM IST

భూపాలపల్లి బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నూతన భవనం ప్రారంభోత్సవంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. శిలాఫలకంపై మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరు లేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్సీ మధసూదనాచారి వర్సెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిగా పరిస్ధితి మారింది. ఆపై ఇరు వర్గాల నేతలు బల ప్రదర్శనకు దిగారు. ఇరువర్గాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో విభేదాలు బయటపడ్డాయి. 

ALso REad: 2 నిమిషాలు ఓపిక పట్టలేవా.. స్టేజ్‌పైనే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై భగ్గుమన్న సీతారాం నాయక్

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే వీరిద్దరూ గొడవపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. అయితే సీతారామ్ మాట్లాడుతుండగా.. మధ్యలో శంకర్ నాయక్ కల్పించుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీతారామ్ నాయక్ .. ఎమ్మెల్యేపై మండిపడ్డారు. సభలు, సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించాలని స్టేజ్‌పైనే క్లాస్ పీకారు. రెండు నిమిషాలు ఓపికపడితే సరిపోదా అంటూ చురకలంటించారు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేస్తావంటూ భగ్గుమన్నారు. మనిద్దరిది ఐదేళ్ల స్నేహమని.. గత ఐదేళ్లలో తాను 24 గంటలూ కాపాడుతూ వచ్చానని సీతారామ్ నాయక్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios