Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ లో వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత : బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ

వరంగల్ లో వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత : బీజేపీ, బీఆర్ఎస్  వర్గాల మధ్య ఘర్షణ

Clashes Between  BRS  and BJP  Workers  At   BRS MLA Vinay Bhaskar  Camp Office in Warangal lns
Author
First Published Aug 24, 2023, 11:21 AM IST

వరంగల్:  బీఆర్ఎస్ ఎమ్మెల్యే  వినయ్ భాస్కర్  క్యాంప్ కార్యాలయం వద్ద  గురువారంనాడు ఉద్రిక్తత చోటు  చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరు వర్గాల మధ్య  దాడి చోటు  చేసుకుంది.  ఈ దాడిలో  ఇరు వర్గాలకు  గాయాలయ్యాయి.  గాయాలైన వారిని  పోలీసులు ఆసుపత్రికి తరలించారు.  ఇరు వర్గాలను  చెదరగొట్టేందుకు  పోలీసులు ఇరు వర్గాలపై  లాఠీ చార్జీ  చేశారు.

ఇవాళ ఎమ్మెల్యే  వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చింది.ఈ క్రమంలోనే  ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం వద్దకు  బీజేపీ శ్రేణులు  గురువారం నాడు వచ్చాయి.క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు  బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.  దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట , వాగ్వాదం చోటు చేసుకుంది.  చివరకు ఇది  కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే వరకు  వెళ్లింది. 

ఃరాష్ట్ర ప్రభుత్వం  ఇచ్చిన హామీలను  నెరవేర్చలేదని   బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది.  దీంతో  బీజేపీ  వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మను  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. గృహ నిర్భంధం నుండి పద్మ బయటకు వచ్చింది. ఆమెను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు బీజేపీ శ్రేణులు   వినయ్ భాస్కర్ ఇంటి ముందు  ఆందోళనకు దిగే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. అయితే  వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో  బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య  ఘర్షణ చోటు  చేసుకుంది. రాళ్ల దాడి జరిగింది.  ఈ సమయంలో  పోలీసులు  ఇరు వర్గాలపై  లాఠీ చార్జీ జరిగింది.

ఈ ఘటనలో  ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని  ప్రభుత్వాసుపత్రికి చికిత్స అందించారు. ఒక్కరికి  తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత స్థానికంగా  ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలను  వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం నుండి పోలీసులు తరలించారు . అదుపులోకి తీసుకున్న రెండు పార్టీల శ్రేణులను పోలీసులు  పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios