Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌, సీపీఐ వర్గాల మధ్య ఘర్షణ.. అసలేం జరిగిందంటే..?

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్లులో శుక్రవారం టీఆర్ఎస్, సీబీఐ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Clash Between TRS and CPI leaders in Kamanchikal in Khammam
Author
First Published Dec 2, 2022, 3:30 PM IST

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామంచికల్లులో శుక్రవారం టీఆర్ఎస్, సీబీఐ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీపీఐకి చెందిన సర్పంచ్ వెంకటరమణ,  పలువురు వార్డు మెంబర్లు, నాయకులు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే దీనిపై పలువురు సీపీఐ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కామంచికల్లుకి వచ్చిన సీపీఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్‌ని ఊర్లోకి రావోద్దంటూ టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. 

ఈ క్రమంలోనే కమలాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కమలాకర్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న విషయం  తెలుసుకున్న కమలాకర్ స్వగ్రామమైన గుడురుపాడు నుంచి సీపీఐ నాయకులు.. కామంచికల్లుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఈ క్రమంలో సీపీఐ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వివాదం జరిగింది.  అది కాస్తా దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకన్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బస్వారెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఇక, ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, సీపీఐ అగ్రనాయకులు మైత్రితో సాగుతున్న ఈ సమయంలో.. ఇలా ఖమ్మం జిల్లాలో ఇరు పార్టీ శ్రేణులు ఘర్షణకు దిగడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios