వరంగల్: ఇంటర్ పరీక్షఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదటు ఆ పార్టీ  నేతలు ఆందోళనలు నిర్వహించారు.వరంగల్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వరంగల్ లో సినీ నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ పార్టీ  నిరసన కార్యక్రమాలను చేపట్టింది.సూర్యాపేట జిల్లాలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో మల్లు భట్టి విక్రమార్క, వరంగల్ జిల్లాలో విజయశాంతి, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. వరంగల్ లో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  ధర్నా చేశారు.

ఈ సమయంలో  పోలీసులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.  కాంగ్రెస్ పార్టీ  నేత విజయశాంతితో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను  పోలీసులు అరెస్ట్ చేశారు.