హైదరాబాద్: కేటీఆర్ అవినీతి చేశారని నిరూపిస్తే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తానని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. 

. అధివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణకు కేసీఆర్, కేటీఆర్‌లు రెండు కళ్లలాంటి వాళ్లని ఆయన తెలిపారు. కేటీఆర్‌పై ఆరోపణలు చేసి రాజీనామాలు చేయమని చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. రూ. 50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు నిజాయితీ పరులని ఆయన చెప్పారు. కేసీఆర్, జగన్ ఇద్దరు సమర్ధ నాయకులు అని ఆయన అభిప్రాయపడ్డారు.కేసీఆర్ చెబితే జగన్ వింటారన్నారు. నీళ్ల దోపిడిపై గతంలో కేసీఆర్ మాట్లాడిన మాట వాస్తవమేనని చెప్పారు. 

పోతిరెడ్డిపాడుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకొంటారన్నారు. ఏపీ లో ప్రతిపక్షం అసత్యాలతో  రైతు లను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు.

బాలకృష్ణ కోపంగా మాట్లాడినా విమర్శించినా తిట్టినా..ఓక నిమిషమేనని ఆయన చెప్పారు. ఆయన చెప్పారు. బాలయ్య చాలా నిజాయితీపరుడిగా ఆయన చెప్పారు. 
సంపాదన కోసం రాజకియాల్లోకి రాలేదన్నారు.  

 బాలయ్య కోపం, ఆవేశం సమాజానికి నష్టం కాదన్నారు. ఆయన మాటలను పెద్ద సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.వైసీపీ ప్రభుత్వం కూలిపోయి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఏపీలో సీఎంగా ఉంది ఎన్టీఆర్ కాదని పోసాని కృష్ణ మురళి సెటైర్లు వేశారు.

జర్నలిస్టు కుటుంబానికి రూ. 25 వేలు ఆర్ధిక సహాయం

కరోనాతో మరణించిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రూ. 25 వేలు ఆర్ధిక సహాయం ఇస్తానని ఆయన ప్రకటించారు. 

జర్నలిస్ట్ మనోజ్ మృతి కి చింతిస్తున్నానని చెప్పారు. తన  తరుపున 25 వేల  రూపాయల ఆర్థిక సహాయం చేస్తానన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైతే మళ్ళీ 25వేలు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.