మహిళపై అత్యాచారం , కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వరరావు లొంగిపోయాడు. రెండు రోజులుగా పరారీలో వున్న ఆయన ఎస్‌వోటీ అధికారుల ముందు లొంగిపోయినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
మహిళపై అత్యాచారం , కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వరరావు లొంగిపోయాడు. రెండు రోజులుగా పరారీలో వున్న ఆయన ఎస్‌వోటీ అధికారుల ముందు లొంగిపోయినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఒక మహిళకు రివాల్వర్ గురిపెట్టి అత్యాచారం చేయడంతో పాటు బాధితురాలి భర్తను కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడంటూ అతనిపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం రాచకొండ పోలీసులకు నాగేశ్వరరావు టచ్ లోకి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు ఇంకా ప్రకటన చేయలేదు.
కాగా.. శుక్రవారం వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో నాగేశ్వర్‌రావుపై కేసు నమోదైంది. వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలోని నివాసం ఉంటున్న మహిళ.. నాగేశ్వర్‌రావు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. అంతేకాకుండా తుపాకీతో బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలిపింది. తనతో పాటు తన భర్తను సిటీ విడిచి పెట్టి వెళ్లాలని బలవంతం చేశాడని.. కారులో ఎక్కించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడని చెప్పింది. కారులో ఎక్కించుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడని.. ఇబ్రహీంపట్నం వద్ద వాహనం చిన్న ప్రమాదానికి గురైందని తెలిపింది. ఆ సమయంలో సీఐ నాగేశ్వర్ రావు బారి నుంచి తప్పించుకుని ఫిర్యాదు చేసినట్టుగా తెలిపింది. దీంతో పలు సెక్షన్ల కింద నాగేశ్వర్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నాగేశ్వర్ రావును సస్పెండ్ చేస్తున్నట్టుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read:సీఐ నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోండి.. లేకపోతే పోలీసుశాఖకు చెడ్డపేరు: టీజీ వెంకటేష్
ఇకపోతే.. ఇక, జూన్ నెలాఖరులో మారేడ్‌పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టకముందు.. నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్‌లో, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఆయన పలు హై ప్రొఫైల్ కేసులలో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుకు నాయకత్వం వహించారు. అదే నెలలో సీనియర్ రాజకీయ నాయకులు టీజీ వెంకటేష్, ఆయన బంధువు టీజీ విశ్వప్రసాద్, 80 మందిపై నమోదైన భూ ఆక్రమణకు సంబంధించిన మరో కేసును ఆయన హ్యాండిల్ చేశారు. ఇటీవల యువ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య కేసు, నిర్మాణంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన దొంగతనంపై విచారణకు కూడా ఆయన నాయకత్వం వహించారు.
