నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే.  రెండు, మూడు రోజుల్లో ఆయన కారు ఎక్కనున్నారు. కాగా.. తాను అసలు పార్టీ ఎందుకు మారాలనుకున్నాడో చిరుమర్తి లింగయ్య వివరించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఎవరీ ప్రోద్భలంతోనూ తాను పార్టీ మారడం లేదని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనకు రాజకీయంగా ఎంతో సహకరించారని చెప్పుకొచ్చారు. అయితే.. కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లోకి వస్తారో రారో.. తనకు తెలీదన్నారు. 

ఇదిలా ఉండగా.. చిరుమర్తి పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం తనకు చాలా బాధకలిగిందని ఆయన అన్నారు. లింగయ్య ఇంత నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. లింగయ్య పార్టీ మారుతున్నాడన్న విషయం టీవీలో చూసేంతరకు తనకు తెలీదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. లింగయ్య కు రెండు సార్లు పార్టీ టికెట్ ఇప్పించి.. గెలుపు కోసం కృషి చేశానని గుర్తు చేసుకున్నారు.