ప్రభుత్వం నిషేధించినా చైనా మంజా విక్రయాలు యధేచ్చగా సాగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నాగోల్‌లో చైనా మంజా మెడకు చుట్టుకుని చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.      

చైనా మంజా ఒక చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. నాన్నతో కలిసి బైక్‌పై వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి మెడకి మంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన తండ్రి పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. హైదరాబాద్‌లోని నాగోల్ ఫ్లై ఓవర్‌పై జరిగింది ఈ ఘటన. చైనా మంజాపై నిషేధం వున్నప్పటికీ .. నగరంలోని రోడ్లపై బహిరంగంగా దీనిని విక్రయిస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు చిన్నారి ఆసుపత్రి పాలైంది. పోలీసులు స్పందించి నగరంలో చైనా మాంజా అమ్మకుండా దాడులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred