సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి పిల్లలపైకి దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు పిల్లలపైకి దూసుకుని వెళ్లింది. అయితే. ఈ ప్రమాదం నుంచి పిల్లలు బయటపడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ కారు ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంఘటనపై పోలీసుుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.