ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చిన్నారి తలను మొండెం నుండి వేరు చేసి  పారేశారు. చిన్నారి మొండెం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఎవరు హత్య చేశారనే  కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని కేఈర్‌కే కాలనీలో గోనెసంచిలో చిన్నారి తల లభ్యమైంది. చిన్నారిని వదిలేస్తే కుక్కలు ఏమైనా ఆ చిన్నారిని చంపాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కుక్కలు చంపితే తలపై గాయాలు ఉంటాయి... మొండెం ఎలా వేరు అవుతోందని కూడ అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారి తల దొరికిన సమీపంలోనే రక్తం మరకలను పోలీసులు గుర్తించారు. చిన్నారి మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు.