హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ లను కూడా నిర్మించారు. కాగా.. శుక్రవారం హైటెక్ సిటీ మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ ని ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి... ఈ ఫ్లై ఓవర్ ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్లు ఉపయోగపడతాయన్నారు. ఎస్ఆర్ డీపీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో  జీహెచ్ఎంసీ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ లు నిర్మిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు.. అనుకున్న సమయం కంటే ముందుగానే ఫ్లై ఓర్లను పూర్తి చేస్తున్నారని.. ఇది చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.