టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆదివారం నాడు సవాల్ విసిరారు. చేవేళ్లలో పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్:దమ్ముంటే రా....చేవేళ్లలో పోటీ చేద్దాం అంటూ చేవేళ్ల ఎంపీ Ranjith reddy టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. నువ్వా నేనా చూసుకొందాం అంటూ రంజిత్ రెడ్డి సవాల్ చేశారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి Chevella MP డాక్టర్ రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో చేవేళ్ల నుండి పోటీ చేయాలని Revanth Reddyకి రంజిత్ రెడ్డి సవాల్ చేశారు. చేతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో మాతో కొట్లాడాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. తమ పార్టీ నేతలు ముఖ్యంగా కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు రంజిత్ రెడ్డి.తమ పార్టీ నేతలపై చేస్తున్న విమర్శలకు సంబంధించిన ఆధారాలను చూపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలు భూములు ఆక్రమించుకొన్నారని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రంజిత్ రెడ్డి చెప్పారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన పోరు సభలో టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.ఈ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు ఇవాళ కౌంటరిచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు ప్రాజెక్టులు సాధించుకొన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే చేవేళ్లలో పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో తాను కొడంగల్ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధగా ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డి బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు.ఈ స్థానం నుండి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి రేవంత్ రెడ్డిపై విజయం సాధించాడు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుండి గెలిచిన మూడు స్థానాల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించిన మల్కాజిగిరి ఒకటి. నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువగిరి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు విజయం సాధించారు.
ఇదిలా ఉంటే చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సవాల్ పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. 2019 ఎన్నికలకు ముందు ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి రంజిత్ రెడ్డి చేతిలో విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
