హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అపాయింట్ మెంట్ అడిగానని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈటల బయట తిడుతుండు... మళ్లీ లోపలికి వెళ్తున్నాడని ఆయన సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ తో కేసీఆర్ పార్టీ పెట్టించొచ్చని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు.

also read:ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల్ని  ఏకం చేసే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్పారు.రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ నాయకత్వం సరిగా లేదన్నారు. ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలతో కూడ తాను చర్చిస్తానని ఆయన తెలిపారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.