పార్టీ టిక్కెట్టిస్తే వేములవాడ నుండి పోటీ: చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరిక


మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు  తనయుడు డాక్టర్  చెన్నమనేని వికాస్ రావు  ఇవాళ బీజేపీలో చేరారు.

Chennamaneni Vikas Rao joins in BJP  lns

హైదరాబాద్: మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు  బుధవారంనాడు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వేములవాడ నుండి  తన అనుచరులతో ర్యాలీగా హైద్రాబాద్ బీజేపీ కార్యాలయానికి  డాక్టర్ వికాస్ రావు వచ్చారు.   బీజేపీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తన జీవితంలో ఇది మరుపురాని రోజుగా  డాక్టర్ వికాస్ రావు పేర్కొన్నారు.డాక్టర్ గా , సామాజిక కార్యకర్తగా  తాను  అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా  డాక్టర్ వికాస్ రావు  చెప్పారు.ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తే  మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు తాను ఇవాళ బీజేపీలో చేరినట్టుగా వికాస్ రావు చెప్పారు. ప్రజలు, బీజేపీ క్యాడర్ ఆకాంక్ష మేరకు తాను కమలం పార్టీలో చేరినట్టుగా తెలిపారు.ఒకవేళ బీజేపీ  నాయకత్వం తనకు వేములవాడ టిక్కెట్ ఇస్తే తాను  బరిలో దిగుతానని  వికాస్ రావు  చెప్పారు. కొడుకు తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. తన తండ్రి విద్యాసాగర్ రావు ఆశీస్సులు తనకు  ఉంటాయని  వికాస్ రావు  ధీమాను వ్యక్తం చేశారు. 

also read:రాజకీయాల్లోకి చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు: బీజేపీలోకి వికాస్ రావు

వేములవాడ అసెంబ్లీ స్థానంలో గత కొంత కాలంగా  డాక్టర్ వికాస్ రావు  సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిమ పౌండేషన్ ద్వారా  వికాస్ రావు ఈ కార్యక్రమాలు చేపట్టారు. అయితే  రానున్న ఎన్నికల్లో  వేములవాడ  స్థానం నుండి డాక్టర్ వికాస్ రావును బీజేపీ  బరిలోకి దింపనుంది.  వేములవాడ నుండి  వికాస్ రావు  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డాక్టర్ వికాస్ రావుతో పాటు ఆయన భార్య కూడ  ఇవాళ బీజేపీలో చేరారు.డాక్టర్ వికాస్ రావు  సతీమణి కూడ బీజేపీలో చేరారు.  తాము భేషరతుగా  పార్టీలో చేరినట్టుగా  వికాస్ రావు  భార్య చెప్పారు.పార్టీ ఆదేశాలను తాము తప్పకుండా పాటిస్తామన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios