Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్‌లో బెట్టింగ్‌కి అప్పులు: యువకుడి ఆత్మహత్య

జిల్లాలోని రుద్రూరులో ఐపీఎల్ బెట్టింగ్ లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎల్ లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టొద్దని తండ్రి బతిమిలాడినా కూడ అతను వినలేదు. అప్పులు, వడ్డీ పెరిగి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

charan commits suicide in nizambad district lns
Author
Nizamabad, First Published Nov 19, 2020, 4:42 PM IST

నిజామాబాద్: జిల్లాలోని రుద్రూరులో ఐపీఎల్ బెట్టింగ్ లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎల్ లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టొద్దని తండ్రి బతిమిలాడినా కూడ అతను వినలేదు. అప్పులు, వడ్డీ పెరిగి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

రుద్రూరుకు చెందిన చరణ్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 2.50 లక్షలు పెట్టాడు. అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్ లో డబ్బులు పెట్టాడు. ఈ విషయం తెలిసి  తండ్రి వద్దని వారిని బతిమిలాడాడు,కానీ తండ్రి మాటను అతను వినలేదు, బెట్టింగ్ లో డబ్బులు పోగోట్టుకొన్నాడు. ఈ అప్పులు తీర్చలేక చరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ విషయం తెలిసి తల్లీదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ బెట్టింగ్ లకు కోసం అప్పులు చేసిన చాలా మంది వీటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఐపీఎల్ బెట్టింగ్ లపై పోలీసులు నిఘాల పెట్టినా కూడ పోలీసుల కళ్లుగప్పి ఈ బెట్టింగ్ నిర్వహించారు.  ఐపీఎల్ ముగిసిన తర్వాత బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయిన వారు ఆత్మహత్యలు చేసుకోవడంతో బెట్టింగ్ వ్యవహరాలు వెలుగు చూస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios