హైదరాబాద్: ఇంటర్ సిలబస్ ను తగ్గించబోమని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ తరగతుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం ఇంటర్ బోర్డు ఎదురు చూస్తోంది. 

కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలను ఇంటర్ బోర్డు రద్దు చేసింది. తరగతులను ఎప్పుడు ప్రారంభించాలనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇంటర్ పరీక్షా విధానంలో మార్పులు ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ బుధవారం నాడు ప్రకటించారు.

also read:కరోనా దెబ్బకు తెలంగాణలో పరీక్షలు రద్దు: ఫెయిలైనవారంతా పాస్

30 శాతం సిలబస్ ను ఆన్ లైన్ లో పెడతామని ఆయన తెలిపారు. త్వరలో ఇంటర్ బోర్డు యూ ట్యూబ్ ఛానెల్ ను స్టార్ట్ చేస్తోందన్నారు. ఈ ఛానెల్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఇప్పటికే ఆన్ లైన్ టీచింగ్ పై ఇంటర్ లెక్చరర్లకు ట్రైనింగ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రైవేట్ కాలేజీలు కూడ ఇంటర్ బోర్డు ఆదేశాలను పాటించాలని ఆయన ప్రకటించారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయంలో పనిచేసే పలువురు ఉద్యోగులు ఇటీవల కరోనా సోకింది. దీని ప్రభావం ఇంటర్ కాలేజీల గుర్తింపు, ఆడ్మిషన్ల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.