మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. చండూర్ మున్సిపల్ ఛైర్మెన్ తోకల చంద్రకళ టీఆర్ఎస్ లో చేరారు. చంద్రకళ బాటలోనే మరికొందరు కౌన్సిలర్లు కూడ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు.నాంపల్లి మండలానికి చెందిన కొందరు సర్పంచ్ లు కూడ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు

మునుగోడు:మునుగోడునియోజకవర్గంలో (munugode)కాంగ్రెస్ పార్టీకీ షాక్ (congress)తగిలింది. గులాబీ గూటికి చేరిన చండూర్(chandur) మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ(tokala chandrakala). చంద్రకళ బాటలోనే మరికొందరు  టీఆర్ఎస్ (trs)లో చేరారు.మున్సిపల్ కౌన్సిలర్లు అన్నెపర్తి శేఖర్,కొండ్రెడ్డి యాదయ్య లతో పాటు కో-అప్షన్ సభ్యురాలు సంకోజు దుర్గమ్మలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు.సోమవారం నాడు సాయంత్రం హైదరాబాద్ తెలంగాణా భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ (ktr)సమక్షంలో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ టీఆర్ఎస్ లో చేరారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:కాంగ్రెస్ హయంలో కంటే ఎక్కువ నిధులు: పాతబస్తీ అభివృద్దిపై అసెంబ్లీలో కేటీఆర్

పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రులు కేటీఆర్,జగదీష్ రెడ్డి లు. నాంపల్లి మండలానికి చెందిన సర్పంచ్ లు సుధాకర్,రమేష్ లు కూడ టీఆర్ఎస్ లో చేరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి,సంకోజు సాయన్న, బెల్లంకొండ శేఖర్ తదితరులు కూడ టీఆర్ఎస్ లో చేరారు. 

ఈ కార్యక్రమంలో యం పి లు బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి,శాసనసభ్యులు సైదిరెడ్డి మాజీ యం పి బూర నర్సయ్య గౌడ్,మాజీ యం ఎల్ ఏ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.