Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఎక్కడోడు, నన్నే తిడుతాడా: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాతనాన్ని మరిచి తనపై విమర్శలు చేస్తున్నారని ఏపి ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజేంద్రనగర్ లో ప్రజా కూటమి అభ్యర్థి గణేష్ గుప్తాకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు.

chandrababu roadshow at rajendra nagar
Author
Rajendranagar mandal, First Published Dec 1, 2018, 2:15 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాతనాన్ని మరిచి తనపై విమర్శలు చేస్తున్నారని ఏపి ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆవేధన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజేంద్రనగర్ లో ప్రజా కూటమి అభ్యర్థి గణేష్ గుప్తాకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్, నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు.

తాను దాదాపు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో పోరాడానని...అలాంటిది అదే కాంగ్రెస్ తో కలవడానికి చాలా పెద్ద రీజన్ ఉందని చంద్రబాబు వివరించారు. దేశాన్ని,  ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికే కాంగ్రెస్ తో జతకట్టానని అన్నారు. కానీ కొందరు ఈ పొత్తుపై నీచంగా మాట్లాడుతున్నారని....మా స్వార్థం కోసం, రాజకీయాల కోసం మాత్రం తాము కలవలేదని చంద్రబాబు స్పషట్ం చేశారు. 

దేశంలో పెద్ద మోదీ... రాష్ట్రంలోని చిన్న మోది(కేసీఆర్)కి చాలా పోలికలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇద్దరూ బాగా మాట్లాడావారేనని...ప్రధాని ఎన్నికల ప్రధాని అయితే కేసీఆర్ కూడా అలాంటివాడే అన్నారు. ఇలా ఇద్దరి మధ్య స్నేహం కుదిరే ఒక్కటయ్యారన్నారు. మోదీ ఒత్తిడి వల్లే కేసీఆర్ పేరు సిబిఐ చార్జిషీట్ లోంచి తీసేశారని చంద్రబాబు ఆరోపించారు. 

నలబై సంవత్సరాల రాజకీయానుభవంతో దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నేనే రాహుల్ ఇంటికి వెళ్లి కలిసి పనిచేద్దామని మాట్లాడానని చంద్రబాబు వెల్లడించారు. దేశాన్ని కాపాడుకకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. 

హైదరాబాద్ అభివృద్దికి శ్రీకారం చుట్టింది తానేనని చంద్రబాబు పేర్కొన్నారు.  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వస్తే రంగారెడ్డి, మహబూబ్ నగర్ లు అభివృద్ది చెందుతాయనే శంషాబాద్ లో ఏర్పాటుచేశామన్నారు. డిఫెన్స్ ల్యాబ్ ఉందని కొందరు వ్యతిరేకిస్తే వాజ్ పేయి వద్దకు వెళ్లి అనుమతులు తెచ్చింది తానేనని గుర్తు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు కూడా నా చలవే అని చంద్రబాబు వెల్లడించారు. అలాగే సైబరాబాద్ ను నిర్మించి అన్ని కంపనీలు తీసుకువచ్చామన్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా తాను చేపట్టిన పనులన్ని కొనసాగించిందని చంద్రబాబు వెల్లడించారు.

 తెలుగు దేశం పార్టీ లేకపోతే అసలు కేసీఆర్ ఎక్కడోడు అంటూ చంద్రబాబు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర పనిచేసిన వ్యక్తే నన్ను తిడుతున్నాడని ఆవేధన వ్యక్తం చేశారు. అయితే  ప్రజల కోసం ఎన్ని తిట్లయినా తింటానని చంద్రబాబు తెలిపారు.

తాను తెలంగాణ కు వచ్చే అవకాశం లేదని...ఏపికే పరిమితమవుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమయితే కేంద్ర రాజకీయాలపై దృష్టి పెడతానని....కానీ ప్రధాని పదవి కోసం మాత్రం తాపత్రయపడనని అన్నారు. ఆ పదవిపై వ్యామోహం కూడా తనకు లేదన రెండు సార్లు ఆ అవకాశం వస్తే వద్దనుకున్నానని తెలిపారు.  సైబరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా తయారు చేసి చూపిస్తానని కేసీఆర్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లొ పెద్ద మోదీ, చిన్న మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios