Asianet News TeluguAsianet News Telugu

బంగారు బాతును అప్పగిస్తే, అప్పులపాల్జేశావ్: కేసీఆర్ పై చంద్రబాబు

తాను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు బాతులా కేసీఆర్ కు అప్పగిస్తే దాన్ని కాపాడాల్సింది పోయి అప్పులపాల్జేశాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్భుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా షాపూర్ నగర్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

chandrababu naidu fires on kcr
Author
Hyderabad, First Published Dec 4, 2018, 8:37 PM IST

హైదరాబాద్: తాను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు బాతులా కేసీఆర్ కు అప్పగిస్తే దాన్ని కాపాడాల్సింది పోయి అప్పులపాల్జేశాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్భుల్లాపూర్ నియోజకవర్గం ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా షాపూర్ నగర్ లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తాను బంగారుబాతులా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే దాన్ని కాపాడుకోవాల్సింది పోయి అప్పులపాల్జేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ప్రజాకూటమి అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను ఇక్కడకు వచ్చి పెత్తనం చేస్తానని దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధికి సాయపడతానని ఆయన స్పష్టం చేశారు. 

తాను హైదరాబాద్, సైబరాబాద్‌లో కాలినడకన తిరిగానని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రతీ గల్లీగల్లీ తిరిగానని చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో కేసీఆర్ ఏనాడైనా బయటకు వచ్చాడా అంటూ నిలదీశారు. 

రోడ్డు యాక్సిడెంట్ అయినా బయటకు రాడు, రాష్ట్రం నష్టపోతున్నా బయటకు రాడని నిత్యం ఫాం హౌస్ కే పరిమితం అవుతారన్నారు. కానీ ఎన్నికలు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాడని చంద్రబాబు ఆరోపించారు.

బీజేపీకి ఓట్లు లేవు కానీ హెలికాప్టర్ లు మాత్రం ఉన్నాయంటూ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ హామీలు ఏమయ్యాయని చంద్రబాబు మండిపడ్డారు.

 ప్రధాని నరేంద్రమోదీ టీడీపీపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వంశపారం పర్య పార్టీ అంటూ మోదీ ఆరోపించడాన్ని ఖండించారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ వంశపారం పర్యం పార్టీ అని గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు. 

టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు లేవని, ఉన్న ఓట్లు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలవేనన్నారు. టీఆర్ఎస్ కు క్యాడర్ లేదని డబ్బులు సంచులు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థికి 15 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు. విచ్చలవిడిగా టీఆర్ఎస్ డబ్బులు ఖర్చుపెడుతుందన్నారు. వాళ్ల ప్రలోభాల మాయలోపడి ప్రజలు మోసపోవద్దు అని సూచించారు. 

ప్రజాకూటమికి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ కు అసహనం వస్తుందన్నారు. ముస్లిం యువకుడు రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే మీ బాబును అడుగు అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, అలాగే ప్రజలను బేవ్ కూఫ్ అంటూ పరుషపదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు దగ్గరకు కార్యకర్తలు ప్రేమతో వస్తారని కేసీఆర్ దగ్గరకు వెళ్లరని తెలిపారు. కేసీఆర్ దగ్గర ప్రేమ లేదని ఓడిపోతామనే పిరికితనం ఉందన్నారు. ఎన్నికల్లో గెలుస్తామంటూ కేసీఆర్ మేనిక్యూలేట్ చేస్తున్నాడని విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios