Asianet News TeluguAsianet News Telugu

మంత్రి పదవి ఇచ్చుంటే.. కేసీఆర్‌ పార్టీ పెట్టేవాడా: చంద్రబాబు

తాను వచ్చింది కేసీఆర్ కోసం కాదని ప్రజల కోసమని స్పష్టం చేశారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. 

chandrababu naidu comments on KCR
Author
Sathupally, First Published Dec 5, 2018, 1:13 PM IST

తాను వచ్చింది కేసీఆర్ కోసం కాదని ప్రజల కోసమని స్పష్టం చేశారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు.

హైదరాబాద్‌ను కులీకుత్‌బ్ షానే నిర్మించారని.. తాను కట్టింది సైబరాబాద్ మాత్రమేనని ఏపీ సీఎం స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ వేరు వేరు కాదని కె.చంద్రశేఖర్ రావు చిన్న మోడీ అని బాబు అభివర్ణించారు. తెలుగుదేశం లేకపోతే కేసీఆర్ ఎక్కడ ఉండేవారు.. తాను మంత్రి పదవి ఇచ్చుంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టేవారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

రూ. 5 లక్షల రుణంతో ప్రజలకు ఇల్లు కట్టించి ఇచ్చేలా ప్రజాకూటమి ప్రణాళికలు రూపొందించిందన్నారు. 37 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో పొరాడమని.. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అదే కాంగ్రెస్‌తో కలిశామని ఏపీ సీఎం స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ రాజ్యాంగ వ్యవస్థలను స్వలాభం కోసం వినియోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు పాలు నీళ్లలా కలిసిపోయి ఎన్నికల్లో కష్టపడుతున్నారని బాబు ప్రశంసించారు.

అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును వేదిక ఎక్కకుండా కేసీఆర్ పక్కకు నెట్టివేశారని... టీఆర్ఎస్ నేతలంతా ఇలాగే ఉన్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను హైకోర్టు తప్పు బట్టిందని ఆయన గుర్తు చేశారు.

సోనియా, రాహుల్, నన్ను విమర్శిస్తున్నారన్నారు. విమర్శిస్తే తప్పు లేదు.. బెదిరిస్తే తప్పని చంద్రబాబు హెచ్చరించారు. పగలంతా బీజేపీతో.. రాత్రంతా ఎంఐఎంతో తిరుగుతారని టీడీపీ అధినేత ఆరోపించారు.

15 మంది తెలుగుదేశం నుంచి గెలిస్తే.. అందరూ టీఆర్ఎస్ వైపు వెళ్లారని.. కానీ సండ్ర వెంకట వీరయ్య ఒక్కరే మిగిలారని ఆయన ప్రశంసించారు. సత్తుపల్లిని ఎందుకు జిల్లాగా చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 2009లో పొత్తు విషయంలో కేసీఆర్‌కు సీట్లు ఇవ్వనంటే.. తన ఇంటికి వచ్చి ఏమిచ్చినా పర్లేదన్నాడని టీడీపీ అధినేత గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios