హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు పగులగొట్టి ఈడ్చుకుంటూ వెళ్లిపోయారంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. 

కుటుంబ సభ్యులతో ఉన్న వ్యక్తి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ నిలదీశారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నారు కానీ అది శాశ్వతం కాదన్నారు. ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మోదీ సీనియర్ మోదీ అయితే జూనియర్ మోదీ కేసీఆర్ అంటూ మండిపడ్డారు. బీజేపీకి బీ టీమ్ కేసీఆర్ అని సీ టీమ్ ఎంఐఎం అంటూ ఘాటుగా విమర్శించారు.