Asianet News TeluguAsianet News Telugu

కార్వీ కేసులో మరో రెండు అరెస్ట్‌లు: మోసంలో పార్థసారథికి సాయం... సీఈవో, సీఎఫ్‌వోలు అరెస్ట్

కార్వీ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. రూ.300 కోట్ల నష్టాన్ని కూడా కష్టమర్ల నెత్తిన పెట్టినట్లుగా తెలుస్తోంది. సీఈవో రాజీవ్ రంజన్  సింగ్, సీఎఫ్‌వో  హరికృష్ణలను అరెస్ట్ చేశారు. అలాగే పార్థసారథి చెప్పినట్లు నకిలీ కంపెనీలు సృష్టించి.. సీఈవో, సీఎఫ్‌వో భారీ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

ceo and cfo arrested in karvy consultants fraud
Author
Hyderabad, First Published Sep 2, 2021, 5:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కార్వీ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. రూ.300 కోట్ల నష్టాన్ని కూడా కష్టమర్ల నెత్తిన పెట్టినట్లుగా తెలుస్తోంది. సీఈవో రాజీవ్ రంజన్  సింగ్, సీఎఫ్‌వో  హరికృష్ణలను అరెస్ట్ చేశారు. అలాగే పార్థసారథి చెప్పినట్లు నకిలీ కంపెనీలు సృష్టించి.. సీఈవో, సీఎఫ్‌వో భారీ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 9 షెల్ కంపెనీల ద్వారా 600 కోట్లకు పైగా మోసం చేసినట్లుగా తెలుస్తోంది. 

మరోవైపు బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో కార్వీ ఎండీ పార్ధసారధి నుండి సీసీఎస్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారని సమాచారం.  రెండు రోజుల పాటు కార్వీ ఎండీ పార్ధసారథిని సీసీఎస్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

కస్టమర్ల షేర్లను కార్వీ ఎండీ పార్ధసారథి తాకట్టు పెట్టి తన స్వంత ఖాతాల్లోకి నిధులను మళ్లించినట్టుగా  పోలీసులు గుర్తించారు. రూ. 780 కోట్లను నేరుగా ఖాతాదారులకు మోసం చేశారని గుర్తించారు. రూ. 720 కోట్ల షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుండి రుణం పొందారని సమాచారం. షేర్లను తనఖా పెట్టి రూ. 1200 కోట్లను బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఎగవేశాడు.  

ఇతర రాష్ట్రాల్లో కూడ కార్వీ సంస్థ ఎండీ పార్ధసారథిపై కేసులు నమోదయ్యాయి.ఈ  కేసులపై కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. రియల్ ఏస్టేట్, సాప్ట్‌టెక్ కంపెనీల్లో  పెట్టుబడులు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ రెండు కంపెనీల్లో నిధులు లేవని పోలీసులు  తమ దర్యాప్తులో తేల్చారు. ఈ నిధులను ఎక్కడికి తరలించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇప్పటికే రెండు రోజుల కస్టడీ ముగిసింది. అయితే కీలక సమాచారం రాబట్టేందుకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథిని పోలీసులు తీసుకోనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios