తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేయడం కేంద్రం ప్రకటన చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన బియ్యం పంపిణీలో తెలంగాన విఫలమైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది.
తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేయడం కేంద్రం ప్రకటన చేసింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన బియ్యం పంపిణీలో తెలంగాన విఫలమైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది. ఏప్రిల్- మే నెలలో కోటా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నా లబ్దిదారులకు అందకుండా చేసిందని పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను నియంత్రించడంతో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించింది. తనిఖీల సమయంలో ఈ విషయాన్ని గుర్తించినట్టుగా వెల్లడించింది. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణ నిలిపివేసినట్టుగా ప్రకటించింది.
ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని కేంద్రం పేర్కొంది. తెలంగాణ సర్కార్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు చేయడం లేదని తెలిపింది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయం అయ్యాయని.. 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులు నిల్వచేశారని పేర్కొంది. లోపాలు సరిదిద్దుతామన్న మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలిపింది. వీటన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఎఫ్‌సీఐకి రిపోర్ట్ ఇవ్వాలని పేర్కొంది. అప్పుడే సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలించనున్నట్టుగా తెలిపింది.
ఇక, గత కొంతకాలంగా రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందని తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంది. అయితే తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని.. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెబుతుంది.
