జగిత్యాల జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. సెల్‌ఫోన్‌లు విక్రయించే దుకాణంలో చోరీకి పాల్పడి 70 లక్షల విలువ చేసే సొత్తును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్‌లో ఉన్న భవానీ సెల్‌ పాయింట్‌ షాపుపు అర్ధరాత్రి బొలెరో వాహనంలో వచ్చారు..

ఐరన్‌రాడ్‌తో షెట్టర్ పైకి లేపి, లోపలికి చొరబడ్డారు. అనంతరం షోకేస్‌లో ఉన్న అన్ని సెల్‌ఫోన్లు, గల్లాలో ఉనన 10 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. చోరీకి గురైన ఆస్తి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

"