తెలంగాణలో తొలిసారి.. వారు ఇంటి నుంచే ఓటు వేయచ్చు, ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ

తెలంగాణాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపుగా సమానంగా ఉండటం శుభపరిణామని పేర్కొన్నారు.

CEC Rajeev Kumar Press Meet over preparedness for Telangana Elections 2023 ksm

తెలంగాణాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపుగా సమానంగా ఉండటం శుభపరిణామని పేర్కొన్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించింది. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. మొత్తం 119 నియోజకవర్గాల్లో సంసిద్ధతపై కమిషన్ సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని అన్నారు. 

తెలంగాణలోని అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతోనూ భేటీ అయ్యామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్టుగా వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల ఓటర్లు ఉండగా.. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారని చెప్పారు. 

తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని.. ఏకపక్షంగా ఓట్లు తొలగించామని అనడం సరికాదని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 2022-23లో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ అందిన తర్వాతనే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించామని చెప్పారు. తెలంగణలో కొత్తగా 8.11 లక్షల యువ ఓటర్ల నమోదు చేసుకున్నారని తెలిపారు. జూలై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల మంది యువతకు ఓటు హక్కు కల్పించామని చెప్పారు. తెలంగాణలో తొలిసారిగా..  80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫిర్యాదుల కోసం సీ విజిల్ యాప్‌‌ను తీసుకొచ్చామని.. ఏదైనా ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయని తెలిపారు.  

రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కో పోలీసు స్టేషన్‌లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios