హైదరాబాద్‌లో వైన్స్ వద్ద సీసీ కెమెరాలు.. రూ. 10 లక్షలకు మించిన లావాదేవీలపై నజర్..!!

తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో), జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు.

CCTVs at Liquor shops and UPI transfers under check in Hyderabad says deo Ronald Rose ksm

తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో), జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఎన్నికల అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నగరంలోని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్ నుంచి ఈ కెమెరాలను పర్యవేక్షిస్తామని తెలిపారు. 

మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బ్యాంకులు, ఆర్‌బీఐ, ఇన్‌కం ట్యాక్స్‌, విజిలెన్స్‌, ఆర్టీఏ, ఎన్‌సీబీ అధికారులతో రోనాల్డ్‌ రోస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా నగరంలో పార్సిల్స్, కొరియర్‌లకు సంబంధించి విస్తృత తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నగదు, లికర్‌ తరలింపును అడ్డుకోవడానికి  ట్రైన్‌ చెకింగ్‌, సరిహద్దుల వద్ద నిఘా పెట్టాలని తెలిపారు. 18 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, గోడౌన్‌లలో ఎక్సైజ్ అధికారులచే తనిఖీలు నిర్వహిస్తామని, హాట్ స్పాట్‌లను గుర్తించాలని డీఈవో రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. అన్ని గోడౌన్లను తనిఖీ చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆర్‌బీఐ, పోస్టాఫీసు ద్వారా గత ఆరు నెలల్లో ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగిన వివరాలను అందించాలని డీఈవో తెలిపారు. అంతేకాకుండా..యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీమ్) ద్వారా ఒక ఖాతా నుంచి బహుళ ఖాతాలకు నగదు బదిలీల వివరాలను కూడా అందించాలని చెప్పారు. రూ. 10 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై ఐటి శాఖ చర్యలు తీసుకుంటుందని.. నగదు మూలాలను బ్యాంకులు గుర్తించాలని రోనాల్డ్ రోస్ తెలియజేశారు. ఏటీఎంలలో నగదు డిపాజిట్‌ చేసే వాహనాలపై నిఘా, కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. 

తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నగదును సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు తెలియజేయాలని.. అనుమానిత నగదు లావాదేవీలను తప్పనిసరిగా నావిగేట్ చేయాలని డీఈవో తెలిపారు. అక్రమంగా రవాణా అవుతున్న బంగారం, వెండిపై నిఘా ఉంచాలని.. హోల్‌సేల్ మార్కెట్‌లలో తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios