Asianet News TeluguAsianet News Telugu

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కి మరో షాక్... ఇంట్లో సోదాలు

సుకేశ్‌ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్‌ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

CCS  search operation in  Former TV9 CEO Ravi Prakash house
Author
Hyderabad, First Published Mar 21, 2020, 11:49 AM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కి మరో షాక్ తగిలింది. ఆయన ఇంట్లో సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 బీఎన్ రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యువెల్లరీస్ అధినేత సుకేష్ గుప్తా తలదాచుకున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

Also Read కోనేరు కోనప్ప‌పై సర్కార్ సీరియస్: క్వారంటైన్‌కు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు...

దీంతో.. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సుకేశ్‌ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్‌ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

బషీర్‌బాగ్‌ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్‌ఆర్‌ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేడాది అక్టోబర్‌ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలన్నది ఒప్పందం. 

Follow Us:
Download App:
  • android
  • ios