సిర్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కోనప్ప తన భార్యతో కలిసి ఇటీవలే అమెరికాలో పర్యటించి 18న హైదరాబాద్ తిరిగొచ్చారు.

Also Read:కరోనా వివాదంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

విదేశాల నుంచి రావడంతో థర్మల్ స్క్రీనింగ్ చేసి వదిలేశారు. ఎమ్మెల్యే ప్రభావితం చేశారో లేక లైట్ తీసుకున్నారో కానీ ఆయనను, కోనప్ప సతీమణిని అధికారులు క్వారంటైన్‌కు పంపలేదు. సొంతూరు వెళ్లొచ్చని పంపేయడంతో వారు రైళ్లో కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు.

తర్వాత ఆయన మున్సిపల్ సమావేశాల్లోనూ పాల్గొన్నారు. చివరికి మాస్క్ ధరించకుండానే కౌన్సిల్ సమావేశంలో మాట్లాడటంతో పాటు ఆ తర్వాత జరిగిన సమూహిక సత్యనారాయణ వ్రతంలోనూ కోనేరు కోనప్ప దంపతులు పాల్గొన్నారు.

Also Read:విశాఖలో కరోనా మరణం... వదంతులపై స్పందించిన జవహర్ రెడ్డి

క్వారంటైన్‌కు వెళ్లకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఎయిర్‌పోర్టులో తమను పరీక్షించారని అంతా బాగున్నందున ఇక క్వారంటైన్‌కు ఎందుకు అని ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. ఈ విషయం కాస్తా పై స్థాయికి వెళ్లడంతో కోనేరు కోనప్ప కుటుంబాన్ని 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.