సీసీఎంబీ షాకింగ్ సర్వే: హైద్రాబాద్ మురుగునీటిలో కరోనా ఆనవాళ్లు
మురికి నీటిలో కూడ కరోనా ఆనవాళ్లను గుర్తించారు. కరోనా సోకిన 35 రోజుల తర్వాత వైరస్ విడుదలైనట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ప్రకటించారు.
హైద్రాబాద్: మురికి నీటిలో కూడ కరోనా ఆనవాళ్లను గుర్తించారు. కరోనా సోకిన 35 రోజుల తర్వాత వైరస్ విడుదలైనట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ప్రకటించారు.
ముక్కు, నోరు, గాలి ద్వారానే కాకుండా మల, మూత్ర విసర్జన ద్వారా కూడ కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్టుగా సీసీఎంబీ గుర్తించింది.మురుగు నీటిని శుభ్రపర్చే కేంద్రాల నుండి నమూనాల సేకరించి పరీక్షిస్తే కరోనా ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారు. మురుగు నీటిలో కూడ కరోనా ఆనవాళ్లు ఉన్నట్టుగా సీసీఎంబీ తెలిపింది.
మురుగునీటిలో సుమారు 2.6 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా సీసీఎంబీ గుర్తించింది. నగర జనాభాలో ఆరు శాతంగా సీసీఎంబీ అభిప్రాయపడింది.హైద్రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుండి సేకరించిన వ్యర్థ నీటి నమూనాలను ఒక నెల రోజులుగా సేకరించి పరీక్షించారు.
హైద్రాబాద్ లో ప్రతి రోజూ 1800 మిలియన్ లీటర్ల నీటిని ఉపయోగిస్తారు. మురుగు నీటిని 40 శాతం ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా (ఎస్ టీ పీ) శుద్ది చేస్తారు. హైద్రాబాద్ లోని 80 శాతం ఎస్ టీ పీ ల నుండి వ్యర్థాలను సేకరించారు.
సుమారు నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తే సుమారు 2.6 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా తేలిందన్నారు.వీరంతా కూడ కరోనా లక్షణాలు లేకుండా ఉన్నారని సీసీఎంబీ తెలిపింది.