Asianet News TeluguAsianet News Telugu

మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిలకు సీబీఐ నోటీసులు.. ఢిల్లీలో విచారణకు రావాలని ఆదేశం..

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వెళ్లారు.

CBI Officials At minister gangula kamalakar house in karimnagar
Author
First Published Nov 30, 2022, 12:28 PM IST

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్ఎస్ ఎంపీ ఎంపీ గాయత్రి రవికి సీబీఐ నోటీసులు జారీచేసింది. నకిలీ సీబీఐ అధికారి పేరుతో మోసాలకు పాల్పడిన శ్రీనివాస్ కేసులో విచారణ రావాలని నోటీసులు అందజేసింది. విట్నెస్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని కోరింది. కరీనంగర్‌లో గంగులా కమలాకర్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. నకిలీ ఐపీఎస్ పేరుతో మోసాలు చేసిన శ్రీనివాస్ కేసులో నోటీసులు అందజేసింది. రేపు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లిన సమయంలో.. ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసినట్టుగా  తెలుస్తోంది. 

రెండు రోజుల క్రితం ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్, గాయత్రి రవిలతో కలిసి శ్రీనివాస్‌ ఉన్న ఫొటోలను గుర్తించిన సీబీఐ.. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక, నకిలీ సీబీఐ అధికారి ఫోన్‌ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios