Asianet News TeluguAsianet News Telugu

షేక్ పేట భూ వ్యవహారం.... బయటపడుతున్న ఎమ్మార్వో సుజాత అక్రమాలు

సుజాత ఇంట్లో షేక్ పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను‌ కూడా ఏసీబీ అధికారులు‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.
 

CBI Officers Investgating MRO Sujatha Over Shake peta land case
Author
Hyderabad, First Published Jun 8, 2020, 11:47 AM IST | Last Updated Aug 9, 2020, 5:20 PM IST

ఎమ్మార్వో సుజాత అక్రమాలు మరిన్ని బయటపడుతున్నాయి. షేక్ పేట భూ వ్యవహారంలో ఎమ్మార్వో సుజాత మెడ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆదివారం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఎమ్మార్వో సుజాతను అధికారులు సుదీర్ఘంగా విచారించిన కూడా ఇంట్లో దొరికిన రూ.30 లక్షలు, నగలు విషయంలో సుజాత ఆధారాలు చూపించలేదని తెలిసింది. 

శాలరీ డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేశానని సుజాత చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. అయితే బ్యాంకు నుంచి డ్రా చేశానని చెప్పేందుకు ఆధారాలను సైతం ఆమె చూపించలేకపోయారు. 

సుజాత ఇంట్లో షేక్ పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను‌ కూడా ఏసీబీ అధికారులు‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.

ఈ కేసులో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న అందరి కాల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆర్డీవో వసంత కుమారిని అధికారులు విచారించారు. రెండు రోజుల పాటు ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్, ఎమ్మార్వో సుజాతలను సుదీర్ఘంగా అధికారులు విచారించారు. 

ముగ్గురి‌ స్టేట్‌మెంట్లను అధికారులు రికార్డు చేశారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్‌లను రిమాండ్‌కు తరలించారు. లంచం కేసులో సుజాత పాత్ర ఉందని తేలితే సుజాతను కూడా రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios