హైదరాబాద్: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు  హైద్రాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆదివారం నాడు కంటి శస్త్రచికిత్స జరిగింది.  సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది.

శస్త్రచికిత్స పూర్తైన తర్వాత వెంకయ్యనాయుడు ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయి ఇంటికి వెళ్ళారు.  కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. కొంతకాలంగా కంటి సమస్యతో ఆయన ఇబ్బందిపడుతున్నారు.ఈ కారణంగానే శస్త్రచికిత్స చేసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంకయ్యనాయుడు కాటరాక్ట్ శస్త్రచికిత్స చేసుకొన్నారు.