హైదరాబాద్: హత్యకు గురైన ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖాచౌదరిపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జయరాం హత్య తరువాత ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి విలువైన పత్రాలు, ఆభరణాలు తీసుకెళ్లిందని జయరాం భార్య పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. 


దాంతో అక్రమంగా చొరబడినందుకు గాను సంబంధిత సెక్షన్‌ కింద శిఖా చౌదరి, ఆమె స్నేహితుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయపరమైన సలహా తీసుకొని శిఖాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
జయరాం హత్యకేసులో సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి పేరు కొత్తగా రావండంతో ఆయనను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. 

జయరాం హత్య తర్వాత రాకేష్‌రెడ్డి సుభాష్‌రెడ్డికి ఫోన్ చేశాడు. మంగళవారం (రేపు) బంజారాహిల్స్‌ ఏసీపీ నిందితులు నగేష్‌, విశాల్‌, సుభాష్‌లను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.