హైదరాబాద్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు ఒక్కసారి బోల్తా కొట్టడంతో తలకిందులుగా అయి కాస్త దూరం అలాగే వెళ్లింది. బోల్తా పడడంతో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నాయి. దీంతో కారులో ఉన్న నలుగురు సేఫ్ గా బయటపడ్డారు.

ట్యాంక్‌ బండ్‌పై అతి వేగంగా వస్తున్న నిసాన్‌ కారు ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్దకు రాగానే పల్టీ కొట్టడంతో శనివారం​ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్‌ పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్రేన్‌ సహాయంతో కారును పక్కకు తొలగించారు.

ఈ ప్రాంతంలో ఈ వారంలో ఇదో మూడో యాక్సిడెంట్ అని సమాచారం. కారు ప్రమాదం వల్ల ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను నియంత్రించారు.

కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు తగలకపోవడం, ఆ సమయంలో వేరే వాహనాలేవీ పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.