Asianet News TeluguAsianet News Telugu

దారుణం : సవారీకి వెడితే.. అడవిపందులు పీక్కుతిని, ఎముకలగూడై...

డబ్బులకోసం ఘాతుకానికి తెగబడ్డారు. ముక్కూమొహం తెలియని కారు డ్రైవర్ ను ఉరివేసి చంపేసి, అడవుల్లో పడేశారు. ఈ దారుణమైన ఘటనలో హైదరాబాద్ కు చెందిన కారు డ్రైవర్ బీదర్ అడవుల్లో దిక్కులేని చావు చనిపోయాడు. 

car driver murdered by a man trying to steal car and scrap - bsb
Author
Hyderabad, First Published Mar 22, 2021, 2:07 PM IST

డబ్బులకోసం ఘాతుకానికి తెగబడ్డారు. ముక్కూమొహం తెలియని కారు డ్రైవర్ ను ఉరివేసి చంపేసి, అడవుల్లో పడేశారు. ఈ దారుణమైన ఘటనలో హైదరాబాద్ కు చెందిన కారు డ్రైవర్ బీదర్ అడవుల్లో దిక్కులేని చావు చనిపోయాడు. 

ఈ నెల 5న అదృశ్యమైన ఓ కార్ డ్రైవర్ బీదర్ అడవుల్లో శవమయ్యాడు కుటుంబ సభ్యులకు కాకుండా ఎముకలు మాత్రమే లభించాయి. చెట్ల పొదల్లో లభ్యమైన శవాన్ని అడవి పందులు పీక్కు తిన్నాయి. అంత్యక్రియలకు ఎముకలు తప్ప  ఏ ఇతర శరీర భాగాలు దొరకలేదు. చివరకు వాటిని తెచ్చి అంత్యక్రియలు చేశారు.

ఈ విషాదకరమైన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన వివరాల మేరకు ఢిల్లీకి చెందిన శివకుమార్ బీదర్ కు చెందిన ఇంతియాజ్‌ ఖనమ్‌ (24) ఫేస్ బుక్ లో ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఢిల్లీకి మకాం మార్చారు. ఉపాధికోసం నేరాల బాట పట్టారు. ఈ నెల 4న రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు

అఫ్జల్గంజ్ లోని శ్రీ సాయి లాడ్జ్ లో బస చేశారు. కార్లను అద్దెకు తీసుకుని స్క్రాబ్‌కు వేసి సొమ్ము చేసుకునేందుకు పథకాన్ని రచించారు. ఈ నెల 5న నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కారును అద్దెకు తీసుకున్నారు. డ్రైవరు అస్లం ఖాన్ తో కలిసి బయలుదేరారు. మార్గమధ్యలో రవి అనే స్నేహితుడిని శివకుమార్ కారులో ఎక్కించుకున్నాడు. మణ్యకెళ్లి అడవిలో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న శివకుమార్ వైరుతో డ్రైవర్ అస్లాం ఖాన్ గొంతుకు ఉరి వేసి బిగించి హత్య చేశాడు. ఇందుకు రవి, ఇంతియాజ్‌ ఖనమ్‌ సహకరించారు. మృతదేహాన్ని అడవిలోనే వదిలేసి, నిందితులు కారును బీదరులోని ఓ స్క్రాబ్‌ దుకాణం యజమానికి 14000 అమ్మేశారు. తిరిగి నగరానికి వచ్చారు.

నాంపల్లి టిప్పుఖాన్‌ సరాయిలో నివాసముండే అస్లం ఖాన్ భార్య భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలు, లాడ్జి లో లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు చివరికి ఎంజీబీఎస్ దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని చేసినట్లుగా విచారణలో ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios