వనస్థలీపురంలో కారు బీభత్సం.. ఒకరు మృతి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, Aug 2018, 12:37 PM IST
car accident in vanasthalipuram one dead
Highlights

కారు నడిపిన యువకులు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ లోని నగర శివారు వనస్థలీపురం లో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే... వనస్థలీపురంలోని ఆటోనగర్ లో రోడ్డు పక్కన పుట్‌పాత్‌ మీదున్న ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్లడంతో భరత్ (34) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

కారు నడిపిన యువకులు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హయత్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోష్‌రెడ్డి, బీటెక్ విద్యార్థి రషీద్.. ఇద్దరు అర్ధరాత్రి వనస్థలిపురం నుండి హయత్‌నగర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుoది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన భరత్‌తో పాటు గాయపడిన ఇద్దరిని రాజస్థాన్‌కు చెందినవారుగా గుర్తించారు.
 

loader