వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది. ఎస్సార్ఎస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గల్లంతయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరిధిలో ఈ దారుణం జరిగింది. 

వరంగల్ నుంచి తొర్రూరు వెల్తున్న కారు పర్వతగిరి మండలం కొంకపాక వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, కారులో ఉన్న మరో ముగ్గురు గల్లంతయ్యారు.

ప్రమాదంలో పర్వతగిరి మండలం గుంటూరుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతి, వినాయక ట్రేడర్స్ లో పని చేస్తున్న సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గల్లంతైన మరో ముగ్గురికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.