ఇవాళ ఉదయం హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగర శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వస్తూ అదుపుతప్పిన కారు రోడ్డుపై వున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. 

పెద్ద అంబర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పిన కారు రెండు బైక్ లను ఢీ కొట్టింది. దీంతో కాలేజికి వెళుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారనమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.