Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌ల సమ్మె...ప్రయాణీకుల అవస్థలు

2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి. 

cabs and autos strike in Hyderabad
Author
Hyderabad, First Published Jan 8, 2019, 8:39 AM IST

2018 ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో రవాణా సేవలు నిలిచిపోయాయి.

ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని ప్రభావం హైదరాబాద్ మీద పడింది. ఉదయం నుంచే భాగ్యనగరంలో ఆటోలు, క్యాబ్‌లు రోడ్డెక్కలేదు.. ఈ సమ్మెకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ మద్ధతు తెలిపింది.

ఇదే సమయంలో న్యూడెమోక్రసీ, టీ మాస్ ఫోరమ్ కూడా మద్ధతు ప్రకటించాయి. క్యాబ్‌లు, ఆటోల సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios