హైదరాబాద్: తెలంగాణలో  రిజిస్ట్రేషన్ల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం నాడు హైద్రాబాద్ లో భేటీ అయింది.

తెలంగాణ బిల్డర్డస్, రియల్టర్స్  అసోసియేషన్ తో  కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు.

రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తుతున్న టెక్నికల్ సమస్యలు ఇతర అంశాలపై  కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి  తీసుకెళ్లారు.రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండడంతో పాటు పోర్టల్ లో టెక్నికల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసనలకు దిగుతున్నారు.

పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని హైకోర్టు ఇచ్చినా కూడ కొత్త పద్దతిలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.రిజిస్ట్రేషన్లు చేసే సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకొని సలహాలు, సూచనలను మంత్రివర్గ ఉప సంఘం సేకరించనుంది.

 రియల్టర్లు, బిల్డర్స్ అసోసియేషన్ లేవనెత్తిన అంశాలపై కమిటీ చర్చించింది.  పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లను చేయాలని రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు.