డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికిపోయాననే మనస్తాపంతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాబూరావు అనే వ్యక్తి ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వచ్చాడు

డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికిపోయాననే మనస్తాపంతో క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాబూరావు అనే వ్యక్తి ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వచ్చాడు.

నార్సింగి లోని హిమగిరినగర్‌‌లో ఉంటున్నాడు. బాబురావు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా..భార్య స్థానిక కూరగాయల మార్కెట్‌లో ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, కూతుళ్ల వివాహం చేశారు.

బాబురావుకి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే గత ఆదివారం రాత్రి మద్యం తాగి క్యాబ్ నడుపున్న ఇతను మాదాపూర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. కౌన్సెలింగ్‌కు హాజరైన అతడు ఇంటికి తిరిగి వచ్చి.. పోలీసులు పట్టుకున్నందుకు మనస్తాపం చెందాడు..

అనంతరం అతిగా మద్యం సేవించి.. మద్యం మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.