Asianet News TeluguAsianet News Telugu

దారుణం : డబ్బులడిగాడని.. స్నేహితుడిని హత్య చేసి పూడ్చేసి.. కిడ్నాప్ కథ అల్లేశారు..

బీదర్ లో డబ్బులు వచ్చేది ఉంది అని చెప్పి,  అప్పటికే అక్కడున్న సంజయ్ అల్లుడు జగన్నాథ్, ఇద్దరు మిత్రులు సంజు,సంగు కారులో పయనమయ్యారు.  ఫుల్ బాక్ పరిసరాల్లో వెళ్తున్న కారులోనే మధుసూదన్ రెడ్డి ని హత్య చేశారు 

businessman kidnapped from old city, murdered at Sanga Reddy
Author
Hyderabad, First Published Aug 23, 2021, 8:16 AM IST

హైదరాబాద్ : చార్మినార్లోని పేట్లబుర్జ్ పూల్ బాగ్ వద్ద మూడు రోజుల క్రితం కిడ్నాప్ అయిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం, దిగ్వాల్ గ్రామ శివారు పొలంలో  అతడి మృతదేహం లభ్యమైంది.  బాకీ పడిన 40 లక్షల రూపాయలు చెల్లిస్తామని తీసుకెళ్లి మిత్రులే హత్య చేసి, పూడ్చి పెట్టు కిడ్నాప్ కథ అల్లారు. నిందితుల్లో ఒకరిని ఆదివారం చార్మినార్ పోలీసులు అదుపులోకి తీసుకుని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

చార్మినార్ ఏసిపి బిక్షం రెడ్డి బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన ఎడ్ల మధుసూదన్ రెడ్డి (42)  ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి కర్మన్ ఘాట్ లో నివాసం ఉంటున్నారు.  కొద్ది రోజులు ఘాన్సీ బజార్ లో టీ కొట్టు నడిపాడు.  ఈ క్రమంలో పేట్లబుర్జ్ లోని పూల్ బాగ్ లో ఉండే బీదర్ కు చెందిన సంజయ్ కుమార్ (41)తో స్నేహం ఏర్పడింది.  

తూర్పు గోదావరి జిల్లా తణుకు తదితర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి, విక్రయించే సంజయ్ కుమార్, అతని మిత్రులు నెమ్మదిగా మధుసూదన్ రెడ్డిని అందులో భాగస్వామిని చేశారు. ఈ ఏడాది  తణుకులో గంజాయి  తరలిస్తూ సంజయ్ కుమార్ సోదరుడు తో పాటు మరికొందరు పట్టుబడ్డారు.  ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డికి సంజయ్ కుమార్.. అతని బంధువులు రూ. 40 లక్షలు బాకీ పడ్డారు.  ఆ డబ్బులు ఇవ్వాలని ఈ నెల 19న మధుసూదన్ రెడ్డి సంజయ్ కి ఫోన్ చేయగా... ఇస్తామని చెప్పి గురువారం రాత్రి పూల్ బాగ్ కి రప్పించారు.

బీదర్ లో డబ్బులు వచ్చేది ఉంది అని చెప్పి,  అప్పటికే అక్కడున్న సంజయ్ అల్లుడు జగన్నాథ్, ఇద్దరు మిత్రులు సంజు,సంగు కారులో పయనమయ్యారు.  ఫుల్ బాక్ పరిసరాల్లో వెళ్తున్న కారులోనే మధుసూదన్ రెడ్డి ని హత్య చేశారు మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా, కోహీర్ మండలం, దిగ్వాల్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పాతిపెట్టి నిందితులు హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ తర్వాత జగన్నాథ్ రెడ్డి సంజయ్ కుమార్ భార్యకు ఫోన్ చేసి తన మామతో పాటు మధుసూదన్ రెడ్డి కిడ్నాప్ కు గురయ్యారు అని చెప్పాడు.

దీంతో ఆమె  ఈ నెల 20న చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసిపి బిక్షంరెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గురునాయుడు, డీఐ మల్లేష్, ఎస్ఐలు పండరి, గురుస్వామి బృందం పూల్ బాగ్ పరిసరాల్లో సిసి ఫుటేజీలను పరిశీలించింది.  అనుమానంతో జగన్నాథ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. కిడ్నాప్ కట్టుకథగా తేలింది. పోలీసులు శనివారం కోహీర్ మండలం, దిగ్వాల్ వెళ్లి.. మధుసూదన్ రెడ్డి మృత దేహాన్ని కోహిర్ పోలీసులు సహకారంతో బయటకు తీసి, సంగారెడ్డి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.

మరో ముగ్గురు నిందితులు కోసం దక్షిణ  మండలం  డిసిపి గజరావు భూపాల్ ఆధ్వర్యంలో బృందం గాలింపు చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా బీదర్కు పోలీసు బృందం వెళ్ళింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios