హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సు షేక్‌పేట్ నుంచి ఫిల్మ్‌నగర్‌లోని రామానాయుడు స్టూడియో వైపు వెళ్తూ.. ఒక్కసారిగా అదుపు తప్పింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో వెనక్కి వెళ్లింది.. దీంతో 4 కార్లు, 3 ద్విచక్రవాహనాలు ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.