పుష్ప - 2 ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు..
నార్కట్ పల్లి వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వీరు పుష్ప - 2 సినిమా షూటింగ్ కు వెళ్లి వస్తున్న ఆర్టిస్టులుగా తెలుస్తోంది.

హైదరాబాద్ : హైదరాబాద్ - విజయవాడ శివార్లలో నార్కట్ పల్లి వద్ద బస్సును ట్రావెల్స్ బస్సు ఢీ కొంటింది. ఈ ట్రావెల్స్ బస్సులో పుష్ప - 2 సినిమా షూటింగ్ కు వెళ్లివస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో ఆగిఉన్న ఆర్టీసీ బస్సును నల్గొండనుంచి హైదరాబాద్ కు పుష్ప - 2 ఆర్టిస్టులతో వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీ కొంటింది. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ ప్రమాదం గురించి వెంటనే 100కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్ ను క్లియర్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.