Hyderabad Rains: మక్కా మసీద్ ఆవరణలో ప్రమాదం.. భారీ వర్షానికి కుప్పకూలిన మదద్‌ఖానా భవనం

హైదరాబాద్ మక్కా మసీద్ ఆవరణలో ప్రమాదం సంభవించింది. కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షానికి మదద్‌ఖానా భవనం కుప్పకూలింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

building collapse near makkah masjid in hyderabad

మరోవైపు.. నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు  సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు.

ALso REad:వర్షం తగ్గిన గంట తరువాతే రోడ్ల మీదికి రండి.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సూచనలు..

భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios