యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
యాదగిరిగుట్టలో (yadagirigutta) ఘోర ప్రమాదం సంభవించింది. రెండంతస్తుల భవనం (building collapse) కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
