Asianet News TeluguAsianet News Telugu

పొలంలో పనిచేసి రూ. 100 సంపాదన: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హమాలీగా పనిచేసి రూ. 100 సంపాదించాడు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లిలో ప్రవీణ్ కుమార్ హమాలీ పని చేసి రూ. 100 సంపాదించాడు. 

Bsp leader RS Praveen Kumar Earns Rs, 100 After Hamali Work  in Nalgonda district
Author
Hyderabad, First Published Dec 1, 2021, 10:12 PM IST


నల్గొండ: వరి పొలంలో కూలీ పనిచేసి రూ. 100 సంపాదించాడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.ప్రజాసేవ కోసం ఉద్యోగం వదులుకున్న  praveen kumar ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాడు.  తాజాగా నల్గొండ జిల్లాలో ఆయన  పర్యటించారు.  నల్గొండ జిల్లాలోని వరి ధాన్యం బస్తాలు మోశాడు.  ప్రజా సేవకు ఉద్యోగంతో పనిలేదని భావించి ఉద్యోగ విరమణ చేశారు.  ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.

also read:‘వీరజవాన్లకే దిక్కు లేదు, రైతులకు ఎక్స్ గ్రేషియా?ఎన్ని యుగాలు పడుతుందో..’ కేసీఆర్ కి ప్రవీణ్ కుమార్ పంచ్ లు...

తాజాగా Nalgonda జిల్లా నార్కెట్ పల్లిలో పర్యటించారు. అక్కడ  Agriculture  పొలంలో కూలీ Work చేశారు. Paddy ధాన్యం బస్తాలు మోసి రూ.100 సంపాదించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అంటూ స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు.శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది మరోటి లేదని ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకొన్నారు. 

 

కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు.  తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తీరుపై ఒంటికాలిపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం విమర్శలు చేసుకోవడంపై కూడా ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.  బహుజనులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు.

తెలంగాాణ  ప్రభుత్వం  తీరుపై ఎప్పటి కప్పుడు ప్రవీణ్ కుమార్  విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత జూన్ లో గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన అందరు వీరజవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయాన్ని Dr. RS Praveen Kumar గుర్తు చేశారు. ఈ ఘర్షణలో అమరులైనవారి కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి రూ. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలలువుతుందని, ఒక్క Colonel Santosh Kumar కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు 19మంది వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే... ఇటీవలే ప్రకటించిన 700మంది అమరులైన రైతు కుటుంబాలకు Ex Gracia అందడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో..అని ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios